దళపతి వస్తుంటే తప్పుకోవాలి కదా!... విజయ్ సినిమా కోసం వెనక్కి తగ్గిన జీవీ ప్రకాశ్ 'ఇమ్మోర్టల్'
- విజయ్ 'జన నాయగన్' సినిమాతో పోటీని తప్పించుకున్న 'ఇమ్మోర్టల్'
- జులై 23 నుంచి సెప్టెంబర్ 4కు వాయిదా పడిన విడుదల
- జీవీ, కయాదు లోహర్ జంట హారర్ థ్రిల్లర్
- ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్'... నాకు మరణం లేదు అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జులై 23న రావాల్సిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
కోలీవుడ్ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన భారీ చిత్రం 'జన నాయగన్'. విజయ్ కి ఇదే ఆఖరి చిత్రం. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జులై 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు 'ఇమ్మోర్టల్' మేకర్స్ తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంపై జీవీ ప్రకాశ్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరంగా స్పందించారు. "'దళపతి వస్తుంటే తప్పుకోవాలి కదా.. అదీ చివరిసారిగా..!' అంటూ 'జన నాయగన్' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రేమ, మద్దతుతో 'ఇమ్మోర్టల్' సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వస్తుంది" అని పేర్కొన్నారు.
గతంలో విడుదలైన 'ఇమ్మోర్టల్' టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రొమాంటిక్ కామెడీగా మొదలై, ఒక్కసారిగా హారర్ టర్న్ తీసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్‌లో జీవీ ప్రకాశ్, కయాదు లోహర్ మధ్య సంభాషణలు, ఆ తర్వాత గబ్బిలం ముఖంతో కనిపించే భయంకర రూపం ఉత్కంఠను రేపాయి. ఈ చిత్రంలో టీఎమ్ కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శామ్ సీఎస్ సంగీతం, అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.