నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది' జోరు.. గ్లోబల్ టాప్ 10లో ఐదో స్థానంలో సినిమా
- థియేటర్లలో భారీ విజయం తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'పెద్ది'
- నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రామ్ చరణ్ సినిమా
- భారత్‌లో ట్రెండింగ్‌లో రామ్ చరణ్ పెద్ది
- గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన అనంతరం, ప్రస్తుతం ఓటీటీ వేదికగా అలరిస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 2026 సంవత్సరానికి గాను టాలీవుడ్ టాప్ హిట్స్‌లలో ఒకటిగా నిలిచింది. తన క్రీడా నైపుణ్యంతో ఓ సామాన్య కార్మికుడు తన గ్రామ హక్కుల కోసం సాగించిన పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
డిజిటల్ వేదికపై విడుదలైన కొద్ది రోజుల్లోనే 'పెద్ది' చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతూ, భారతీయ స్ట్రీమింగ్ ర్యాంకింగ్స్‌లో ఈ సినిమా అగ్రస్థానంలో కొనసాగుతోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రం హిందీ వర్షన్ త్వరలోనే విడుదల కానుంది.
అంతర్జాతీయ స్థాయలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 (నాన్-ఇంగ్లీష్) జాబితాలో 'పెద్ది' చిత్రం ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 1.9 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, జూలై 30న హిందీ వెర్షన్‌లో విడుదల కానుంది. దీంతో ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మరింత చేరువయ్యే అవకాశం ఉంది.