పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- మూడేళ్లలో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం
- ప్రాజెక్టుల కోసం రూ.35,313 కోట్లు కేటాయించనున్న ప్రభుత్వం
- జలధార పనులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేయాలని ఆదేశం
- 1023 సాగునీటి పథకాల పునరుద్ధరణకు ఏపీఎస్ఐడీసీకి బాధ్యతలు
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ప్రాజెక్టు ప్రదేశం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.35,313 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతి సహా ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా, ఏపీఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1023 సాగునీటి పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.3,883 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల ద్వారా సుమారు 8.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా నీరందుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ఆధునీకరణ కింద మన్యం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేక పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన 'జలధార' కార్యక్రమంపై కూడా సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 11,133 చెరువులు, ఫీడర్ ఛానళ్లను అభివృద్ధి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ పనులను వీబీజీ రామ్ జి సంస్థ ద్వారా చేపట్టాలని, జలధార పనుల కోసం ప్రతి జిల్లాకు తక్షణమే రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.2500 కోట్లను ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు.