రెండోసారి ధరలు పెంచిన మహీంద్రా.. ఏ మోడల్‌పై ఎంత భారం?

Mahindra raises prices for the second time how much more will each model cost
  • గరిష్ఠంగా 2.7% వరకు పెరిగిన ధరలు
  • బొలెరోపై రూ.49 వేల వరకు పెంపు
  • ఎక్స్‌ఈవీ 9ఎస్‌ ధర రూ.70 వేలు పెరిగింది
  • స్కార్పియో ఎన్‌ ధరల్లో మార్పు లేదు
  • ముడిసరుకు ధరల పెరుగుదలే కారణమని కంపెనీ వెల్లడి
మహీంద్రా తన ఎస్‌యూవీ శ్రేణి ధరలను మరోసారి పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గరిష్ఠంగా 2.7 శాతం వరకు ధరలు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.5 శాతం వరకు ధరలు పెంచిన మహీంద్రా.. ఇప్పుడు రెండోసారి రేట్లు సవరించింది. స్కార్పియో ఎన్‌ మినహా దాదాపు అన్ని పెట్రోల్‌, డీజిల్‌ ఎస్‌యూవీలపై ఈ పెంపు వర్తిస్తుంది.

బొలెరోపై అత్యధికంగా రూ.49 వేల వరకు ధర పెరిగింది. థార్‌ 3-డోర్‌, థార్‌ రాక్స్‌, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, బొలెరో నియో, స్కార్పియో క్లాసిక్‌, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. అయితే స్కార్పియో ఎన్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా ధరల ప్రకారం ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రారంభ ధర రూ.7.79 లక్షలు కాగా, థార్‌ రాక్స్‌ ధర రూ.12.52 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో ధర రూ.13.99 లక్షల నుంచి మొదలవుతుంది.

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మాత్రం ఎక్స్‌ఈవీ 9ఎస్‌ ధరను మాత్రమే పెంచింది. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షల నుంచి రూ.20.65 లక్షలకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ.70 వేల పెరిగింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ, బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, బీవైడీ వంటి కంపెనీలు కూడా ధరలు పెంచిన నేపథ్యంలో మహీంద్రా కూడా అదే బాటలో నడిచింది.
Advertisement
Mahindra
Mahindra SUV price hike
Mahindra Bolero price increase
Mahindra Thar ROXX new price
Mahindra XUV 7XO price list
Indian automobile price hike

More Telugu News