రష్యా చమురు కొంటే 500 శాతం సుంకం.. అమెరికాలో బిల్లు సిద్ధం!

Bill in America to impose 500 pc tariif on countries buying oil from Russia is Ready
  • ట్రంప్‌ ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చిన సెనెటర్లు
  • రష్యా యుద్ధానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న దేశాలే లక్ష్యమని వెల్లడి
  • ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం
  • రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి
  • కొన్ని దేశాలకు 180 రోజుల మినహాయింపు ఇచ్చేలా బిల్లు
  • అమెరికా సెనెట్‌లో 84 మంది సభ్యుల మద్దతు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి హెచ్చరిక పంపే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొత్త ఆంక్షల బిల్లును తీసుకురానుంది. ట్రంప్‌ ప్రభుత్వంతో నలుగురు అమెరికా సెనెటర్లు ఇప్పటికే ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించారు. 

రష్యా యుద్ధానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలే లక్ష్యంగా చేసుకున్నారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 500 శాతం వరకు సుంకం విధించే ప్రతిపాదనను బిల్లులో పొందుపర్చారు.

ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి. గతంలోనూ అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ భారత్‌, చైనాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా జాతీయ భద్రతకు అవసరమైతే ఏదైనా దేశానికి 180 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం బిల్లులో ఉంచారు.

ఈ బిల్లుకు అమెరికా సెనెట్‌లో ఇప్పటికే 84 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావడమే దీని లక్ష్యమని సెనెటర్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్‌ వంటి దేశాల ఇంధన దిగుమతులు, వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
USA
America
Russia
Tariffs
Oil
Crude Oil

More Telugu News