‘తక్షకుడు’ షూటింగ్ పూర్తి చేసిన ఆనంద్ దేవరకొండ.. ఎమోషనల్ పోస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘తక్షకుడు’ షూటింగ్ పూర్తి చేసిన ఆనంద్ దేవరకొండ.. ఎమోషనల్ పోస్ట్

Anand Deverakonda completes Takshakudu shooting and shares emotional post
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనంద్‌ భావోద్వేగ పోస్ట్
  • అంధుడి పాత్రలో నటించిన హీరో
  • దర్శకుడు వినోద్ అనంతోజుపై ప్రశంసలు
  • సహనటులతో దిగిన ఫొటోల షేర్
  • త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల
ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘తక్షకుడు’ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. నటుడిగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రాల్లో ఇదొకటని చెప్పారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత దర్శకుడు వినోద్ అనంతోజుతో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందన్నారు. కథను, నటుడిని విభిన్నంగా చూసే దర్శకుడు ఆయన అని ప్రశంసించారు.

తెలుగు ఫోక్‌లోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. గ్రామస్థుల మరణాలకు కారణమైన వారిపై తన పెంపుడు కుక్కతో కలిసి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా నటిస్తున్నారు. ఈ పాత్ర తనకు సవాల్‌గా అనిపించిందని, అదే సమయంలో ఎంతో ఆసక్తికరంగా కూడా ఉందని తెలిపారు. లుక్‌ టెస్ట్‌ స్కెచ్‌లు, షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

సినిమాలో తనతో కలిసి నటించిన ‘బెర్లిన్’ అనే కుక్కతో మంచి అనుబంధం ఏర్పడిందని ఆనంద్ తెలిపారు. దర్శకుడు భావోద్వేగాలకు తగ్గట్టుగా సహజమైన యాక్షన్‌ చేయించారని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ‘తక్షకుడు’ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Anand Deverakonda
Takshakudu
Vinod Anantoju
Netflix
Folklore thriller
Takshakudu movie wrap

More Telugu News