షూటింగ్ లో గాయపడ్డ రాశి ఖన్నా
- అక్షయ్ కుమార్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న రాశి ఖన్నా
- యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డ రాశి
- ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ముద్దుగుమ్మ
బిజీ కథానాయిక రాశి ఖన్నా షూటింగ్ సెట్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ కంటే తమిళ్, హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ తెరకెక్కిస్తున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాశి ఖన్నాకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగిలినప్పటికీ, రాశి ఖన్నా ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. తన వల్ల షూటింగ్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గాయంతోనే ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఒక ఫీమేల్ యాక్టరై ఉండి కూడా డూప్ లేకుండా క్లిష్టమైన స్టంట్స్ చేయడం, గాయపడినా వెనకడుగు వేయకపోవడంతో ఆమె అంకితభావాన్ని చూసి నెటిజన్లు, అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. రాశి ఖన్నా ఇటీవల నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. కమర్షియల్‌గా ఈ సినిమా నిరాశపరచడంతో పాటు, ఇందులో ఆమె పోషించిన క్యారెక్టర్‌కు కూడా పెద్దగా స్కోప్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ బాలీవుడ్ ప్రాజెక్టులపైనే ఉన్నాయి.