కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు
- ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన
- విశాఖ పోర్టు సమీపంలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- కొరియన్ పెట్టుబడిదారులకు 3S విధానంతో రక్షణ కవచంలా ఉంటామని భరోసా
- ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, జాయింట్ ట్రెయినింగ్ అకాడమీల ఏర్పాటుకు సంసిద్ధత
- ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు సూచన
ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్‌లో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్‌తో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, పలు వ్యూహాత్మక ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.
కియాతో ఉన్నత స్థాయి సమావేశం.. భారీ విస్తరణకు ఆహ్వానం
సియోల్‌లో కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అనంతపురంలో ఇప్పటికే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కియా, రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. కియా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న ప్లాట్‌ఫామ్ బియాండ్ వెహికల్ (పీబీవీ) వాహనాల ఉత్పత్తిని కూడా ఏపీలో చేపట్టాలని సూచించారు.
అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసేందుకు వీలుగా విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు, ఈ-జీఎంపీ ప్లాట్‌ఫామ్ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్‌లు, ఈవీ ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక ఈవీ-కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని, పవర్‌ట్రెయిన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కోసం ఒక ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని కూడా స్థాపించాలని కోరారు.
మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై కియా ప్రతినిధి టే హన్ లీ సానుకూలంగా స్పందించారు. 2017లో అనంతపురంలో అడుగుపెట్టి, 2019 నాటికి భారీ ఉత్పత్తి ప్రారంభించిన తీరును గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తమ సంస్థ ఈవీ, అటానమస్ మొబిలిటీపై దృష్టి సారించిందని, లోకేశ్ చేసిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కొరియన్ పెట్టుబడిదారులకు 3S భరోసా
అనంతరం మంత్రి లోకేశ్, దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, తూర్పు తీరంలో సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని, దీనివల్ల అంతర్జాతీయ సరఫరా శృంఖల (సప్లయ్ చైన్) నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమలకు అండగా నిలుస్తాయని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక బంధానికి పెద్దపీట
కొరియన్ సంస్థలు ఏపీకి రావడానికి ముందే, అక్కడి పని ప్రమాణాలు, భాష, సంస్కృతిపై స్థానిక యువతకు అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్ తెలిపారు. దీనికోసం దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసేందుకు ఏపీలో ఒక కొరియన్ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
భారత్‌లోనే రెండో అతి పొడవైన తీరప్రాంతం, విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులు, కొత్తగా రాబోయే నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల వల్ల ఏపీ తక్కువ ఖర్చుతో ఎగుమతులకు లాంచ్‌ప్యాడ్‌గా మారుతుందని లోకేశ్ వివరించారు. భారత్-కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుబంధంగా ఒక ప్రత్యేకమైన 'ఆంధ్రప్రదేశ్-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్' ఏర్పాటు చేయాలని, ఇరు ప్రాంతాల మధ్య వార్షిక ఆర్థిక భాగస్వామ్య చర్చలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి విశాఖపట్నం-బుసాన్/ఇంచియాన్ నగరాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఏపీలోని యూనివర్సిటీల్లో కొరియన్ భాషా కేంద్రాలు, డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాలని కోరారు.