ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 59 గంటలు.. మోటరోలా కొత్త ఫోన్‌ విడుదల

Motorola Moto G77 Power launched with 59 hours battery life on single charge
  • మోటో జీ77 పవర్‌ భారత్‌లో విడుదల
  • ధర రూ.25,999గా నిర్ణయం
  • జులై 13 నుంచి విక్రయాలు
  • 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
  • 50MP డ్యూయల్‌ వెనక కెమెరా
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌
మోటరోలా తన బడ్జెట్‌ ‘జీ’ సిరీస్‌లో కొత్తగా మోటో జీ77 పవర్‌ను భారత్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్‌ కెమెరా, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. జులై 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటరోలా ఆన్‌లైన్‌ స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ధర రూ.25,999గా నిర్ణయించారు. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే గరిష్ఠంగా మరో రూ.2,000 బోనస్‌ కూడా పొందొచ్చు. పాంటోన్‌ ఫ్యూషియా రెడ్‌, పాంటోన్‌ ఇంపెనెట్రబుల్‌, పాంటోన్‌ నాటికల్‌ బ్లూ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

మోటో జీ77 పవర్‌లో ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హలో యూఐ ఇచ్చారు. ఒక ఏడాది ఓఎస్‌ అప్‌డేట్‌, మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ హామీ ఇచ్చింది. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1,050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ఇందులో ఉన్నాయి. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణకు ఐపీ64 రేటింగ్‌ కూడా ఇచ్చారు.

ఈ ఫోన్‌లో 6 నానోమీటర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్‌ ర్యామ్‌, 128జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌ అందించారు. భద్రత కోసం సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి.

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఇచ్చారు. ఇందులో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 120 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌తో 8 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా అందించారు. గరిష్ఠంగా 2కే రిజల్యూషన్‌లో 30 ఎఫ్‌పీఎస్‌తో వీడియోలు రికార్డ్‌ చేయొచ్చు.

మోటో జీ77 పవర్‌లో 7,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 59 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 30 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు 6 వాట్ల రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. 5జీ, బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌బ్యాండ్‌ వైఫై, యూఎస్‌బీ టైప్‌-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Advertisement
Motorola Moto G77 Power
Moto G77 Power India price
7000mAh battery mobile
Motorola G series latest phone
Moto G77 Power camera features
Dimensity 6400 smartphone

More Telugu News