ఇండో-పసిఫిక్‌లో చైనా ముందడుగు: 40 ఏళ్ల తర్వాత జలాంతర్గామి న్యూక్లియర్ మిసైల్ పరీక్షతో ప్రకంపనలు!
- 1982 తర్వాత చైనా మొదటి బహిరంగ జలంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
- పసిఫిక్ మహాసముద్రంలోకి అణు జలంతర్గామి ద్వారా క్షిపణి ప్రయోగం
- 10,000 కిలోమీటర్లకు పైగా పరిధి గల 'JL-3' క్షిపణిగా రక్షణ రంగ నిపుణుల అంచనా
- అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల తీవ్ర ఆందోళన
- భూమి, ఆకాశం, సముద్ర మార్గాల 'న్యూక్లియర్ ట్రైయాడ్' పూర్తి చేసిన చైనా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక ఆధిపత్యాన్ని చాటుకునేలా చైనా అత్యంత కీలకమైన అణు సామర్థ్య పరీక్ష నిర్వహించింది. గత నాలుగు దశాబ్దాల (43 ఏళ్ల) కాలంలో చైనా జరిపిన మొదటి బహిరంగ 'జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి' (ఎస్ఎల్బీఎం) పరీక్షగా ఇది రికార్డుకెక్కింది. సోమవారం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అణుశక్తితో నడిచే ఒక జలాంతర్గామి నుండి చైనా ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇది కేవలం ఒక సాధారణ ఆయుధ పరీక్ష మాత్రమే కాదని, శత్రుదేశాల మొదటి అణు దాడి నుండి తట్టుకుని నిలబడగల సముద్రగర్భ అణు నిరోధక శక్తి తమకు ఉందని చాటిచెప్పే బలమైన 'వ్యూహాత్మక సంకేతం' అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సీనియర్ ఫెలో జావో టోంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాకు ఈ తరహా సామర్థ్యం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఇలా బహిరంగంగా ప్రపంచానికి ప్రదర్శించడం 1982 తర్వాత ఇదే మొదటిసారి. చైనా ఈ ప్రయోగానికి ముందు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ వంటి దేశాలకు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ, ఏ రకమైన క్షిపణిని ప్రయోగించారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.
అయితే, చైనా అధికారిక ఛానల్ 'సీసీటీవీ' సమాచారం ప్రకారం.. ప్రయోగించిన క్షిపణి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి గల అత్యాధునిక 'JL-3' అయ్యే అవకాశం ఉందని చైనా మిలిటరీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిని టైప్ 094 క్లాస్ లేదా నిర్మాణంలో ఉన్న సరికొత్త టైప్ 096 క్లాస్ వ్యూహాత్మక జలాంతర్గామి నుండి ప్రయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రాంతీయ దేశాల తీవ్ర ఆందోళన
చైనా అణ్వాయుధాల విస్తరణపై అమెరికా రక్షణ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి థామస్ పిగాట్ మాట్లాడుతూ.. చైనా వేగంగా పెంచుతున్న అణు సామర్థ్యాలు అంతర్జాతీయ భద్రతకు సవాల్‌గా మారాయన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఈ చర్యను 'ప్రాంతీయ అస్థిరతకు కారణం' అని అభివర్ణించగా, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ రక్షణ శాఖ సైతం చైనా సైనిక చర్యలపై నిఘా పెంచింది.
ఈ ప్రయోగం వెనుక చారిత్రాత్మక వ్యూహం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 1937 జులై 7న జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించిన 'మార్కో పోలో బ్రిడ్జ్' ఘటన వార్షికోత్సవానికి ఒకరోజు ముందే ఈ ప్రయోగం జరగడం గమనార్హం. కాగా, ఈ ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ కొట్టిపారేశారు. ఈ ప్రయోగాన్ని ఇతర దేశాలు అతిగా ఊహించుకోవద్దని, చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ, శాంతియుత అణు విధానాలకే కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ తాజా పరీక్షతో చైనా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా అణు దాడులు చేయగల 'న్యూక్లియర్ ట్రైయాడ్' సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్లయింది.