తీరని పవన్ హామీ.. వీరాభిమాని నిరంజన్ అనారోగ్యంతో మృతి

Pawan Kalyan fan Ponuganti Niranjan passes away due to illness
  • పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూత
  • అరుదైన వ్యాధితో హనుమకొండలో తుదిశ్వాస విడిచిన 'చోటా గబ్బర్ సింగ్'
  • గత నెలలో నిరంజన్‌ను స్వయంగా కలిసి పరామర్శించిన పవన్
  • 'ఓజీ-2' సినిమా కలిసి చూద్దామని అభిమానికి మాట ఇచ్చిన డిప్యూటీ సీఎం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో హనుమకొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. స్థానికంగా 'చోటా గబ్బర్ సింగ్'గా పిలుచుకునే నిరంజన్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిన్నతనం నుంచే తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నిరంజన్, పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలవాలన్నది ఆయన చివరి కోరిక. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్, గత నెలలో స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచంపై ఉన్న నిరంజన్‌ను ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా నిరంజన్ మంచంపై పడుకునే చేసిన డాన్స్ వీడియోలను చూసి పవన్ మురిసిపోయారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇద్దరూ కలిసి 'ఓజీ -2' సినిమా చూద్దామని, అందుకోసం ప్రత్యేకంగా షో వేయిస్తానని నిరంజన్‌కు పవన్ మాట ఇచ్చారు. అయితే, ఆ కోరిక తీరకుండానే నిరంజన్ కన్నుమూయడం పలువురిని కలచివేస్తోంది.
Advertisement
Pawan Kalyan
Ponuganti Niranjan
Chota Gabbar Singh
Janasena Party
Hanumakonda
OG Movie

More Telugu News