భారత్‌ చూపిన మద్దతు ఎప్పటికీ మరువలేం: ఇరాన్‌

Iran says we can never forget the support shown by India
  • ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధి బృందం
  • భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్‌
  • ఇరు దేశాల బంధాన్ని కొనియాడిన ఇరాన్‌
  • భారత మద్దతు మరువబోమని వ్యాఖ్య
ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రతినిధి బృందం హాజరుకావడంపై ఇరాన్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా భారత్‌ చూపిన సంఘీభావం రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి నిదర్శనమని పేర్కొంది.

భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో విడుదల చేసిన ప్రకటనలో భారత ప్రభుత్వం, అధికార ప్రతినిధి బృందం, రాజకీయ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఈ హాజరు పరస్పర గౌరవానికి, స్నేహానికి బలమైన సంకేతమని పేర్కొంది.

భారత రాజకీయ నాయకులు, ఎంపీలు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరుకావడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రతిబింబించిందని వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో భారత్‌ చూపిన మద్దతును ఇరాన్‌ ప్రజలు ఎప్పటికీ మరువరని పేర్కొంది.

టెహ్రాన్‌లో జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరెట్‌, బిహార్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సయ్యద్‌ అతా హస్నైన్‌ భారత ప్రభుత్వ తరఫున హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Iran
India Iran Relations
Ayatollah Ali Khamenei
Pabitra Margherita
Salman Khurshid
Mehbooba Mufti

More Telugu News