జగన్ చెబుతున్న 'మావిగన్'... తూటా లేని గన్: లంకా దినకర్
- మావిగన్ అనే గన్ పేలదంటూ దినకర్ సెటైర్లు
- అయోమయం జగన్నాధం అనేలా జగన్ తీరు ఉందని ఎద్దేవా
- సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోందని వ్యాఖ్య
ప్రధాని మోదీ సంకల్పం వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పిన లంకా దినకర్... జగన్ సంకల్పం మాత్రం ‘వినాశక ఏపీ’ అని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని... పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు, హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ, మార్కాపురం తదితర ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగన్ ఈ అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ‘మావిగన్’ వంటి విషం కక్కుతున్నారని ఆరోపించారు.