90 స్పీడ్.. 160 కి.మీ రేంజ్.. రివోల్ట్ కొత్త ఈ-బైక్

Revolt RVX New EBike with 90 Speed and 160 km Range
  • ప్రారంభ ధర రూ.1.24 లక్షలు
  • ఒక్క ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్
  • 80 నిమిషాల్లో 80% ఛార్జ్
  • బూస్ట్ మోడ్ ప్రత్యేక ఆకర్షణ
ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. కొత్త మోడల్‌తో రివోల్ట్ మోటార్స్ కూడా రంగంలోకి దిగింది. పెర్ఫార్మెన్స్‌తో పాటు అధునాతన ఫీచర్లను కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకొని ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.

రివోల్ట్ మోటార్స్ కొత్త ఆర్‌వీఎక్స్‌ ప్రారంభ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అయితే పీఎం ఈ-డ్రైవ్‌ ప్రోత్సాహకాలతో కలిపితే ధర రూ.1.24 లక్షలకు తగ్గుతుంది. కంపెనీ మోడల్ లైనప్‌లో ఇది ఆర్‌వీ బ్లేజ్‌ఎక్స్‌ కంటే పైస్థానంలో, ఆర్‌వీ400 కంటే దిగువన ఉంటుంది.

ఈ బైక్‌లో 4 కిలోవాట్ల పీఎంఎస్‌ఎం మిడ్-డ్రైవ్ మోటార్ ఇచ్చారు. గరిష్ఠంగా 5.3 కిలోవాట్ల పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి 230ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. దీంతో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 3.9 సెకన్లలో అందుకుంటుంది. బూస్ట్ మోడ్‌లో గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. 3.24 kWh తొలగించగలిగే ఎన్‌ఎంసీ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో 80 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

ఈ బైక్‌లో ఎకో, నార్మల్, స్పోర్ట్ రైడింగ్ మోడ్‌లతో పాటు అదనంగా బూస్ట్ మోడ్ కూడా ఉంది. ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లున్నాయి. 3.5 అంగుళాల IP67 రేటెడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టెలిమాటిక్స్, ఓటీఏ అప్‌డేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

జియో ఫెన్సింగ్, కాల్, మెసేజ్ అలర్ట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, వాక్ అసిస్ట్, ఇమ్మొబిలైజర్, వెహికల్ లొకేటర్ వంటి స్మార్ట్ ఫీచర్లను కంపెనీ అందించింది.
Revolt RVX
Revolt Motors
Electric Bike India
RVX Range and Speed
Revolt Electric Motorcycle
EV Charging Features

More Telugu News