శివరాజ్ సింగ్, చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా... ఏపీ నుంచి దేశవ్యాప్తంగా ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ప్రారంభం
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా ఆవిష్కరణ
- చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచిన ఏపీ
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు నేతలు శ్రీకారం చుట్టారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలి పనులుగా ప్రారంభించారు.
అనంతరం స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి జాబ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ కలిసి పథకం ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పథకానికి సంబంధించిన సమాచార బుక్‌లెట్‌ను, ఇతర ప్రచురణలను విడుదల చేయగా, నేతలంతా కలిసి పథకం అధికారిక పోర్టల్‌ను ప్రారంభించారు.


