శెహభాష్.. లోకేశ్‌: విద్యా శాఖ మంత్రిగా లోకేశ్‌ పనితీరుకు రాష్ట్రపతి ప్రశంసలు

Nara Lokesh Praised by President for Performance as Education Minister
  • ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు
  • రాష్ట్రంలో విద్యా సంస్కరణలు కొనసాగించాలని సూచన
  • అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం ఘటన
  • లోకేశ్‌ ప్రసంగం యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉందని అభినందన
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పనితీరుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కార్యక్రమం ముగిశాక, రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు మంత్రి లోకేశ్‌ హెలికాప్టర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను తన వద్దకు పిలిచిన రాష్ట్రపతి, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి కేంద్రంగా సాగుతున్న ఈ సంస్కరణలు వారికి బంగారు భవిష్యత్తును అందిస్తాయని అన్నారు.

అంతకుముందు స్నాతకోత్సవంలో మంత్రి లోకేశ్‌ చేసిన ప్రసంగం యువతలో స్ఫూర్తి నింపేలా సాగిందని రాష్ట్రపతి కొనియాడారు. పట్టభద్రులకు మంచి సందేశం ఇచ్చారని అభినందించారు. ఏపీ విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు లోకేశ్‌ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
Nara Lokesh
Droupadi Murmu
AP Education Minister
AP Central University Convocation
Andhra Pradesh Education Reforms
Anantapur

More Telugu News