పాత రూ.10, 20, 50, 100 నోట్లు చెల్లవా?.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ!

Business
Advertisement
  • వైరల్‌ వార్తను ఖండించిన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • పాత నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీయేనని స్పస్టీకరణ
  • నోట్ల రద్దుపై ఆర్‌బీఐ ఎలాంటి ఆదేశాలు లేవన్న బ్యాంకు
  • అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచన
Advertisement
2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్‌కు చెందిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూన్‌ 30 తర్వాత చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వాటిని స్వీకరించదంటూ సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ వైరలవుతోంది. దీంతో పాత నోట్లు ఉన్నవారిలో ఆందోళన నెలకొంది.

ఈ ప్రచారంపై బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధికారికంగా స్పందించింది. తమ పేరుతో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో వివరణ ఇచ్చింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్‌ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీయేనని గతంలోనే స్పష్టం చేసింది. 2015లో వాటి చలామణి తగ్గిందని, అవసరమైతే వాటిని కొత్త నోట్లతో మార్చుకోవచ్చని సూచించింది. కానీ ఆ నోట్లను రద్దు చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.

కొత్త నోట్లలో అధునాతన భద్రతా ఫీచర్లు ఉండటంతో నకిలీ నోట్లను అరికట్టడం సులభమవుతుందని మాత్రమే ఆర్‌బీఐ పేర్కొంది. పాత నోట్లు చెల్లవన్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మరోసారి స్పష్టం చేసింది.

ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని తెలిపింది.
Advertisement

సంబంధిత వార్తలు

Bank of MaharashtraReserve Bank of IndiaOld Currency NotesMahatma Gandhi SeriesRBI GuidelinesCurrency Note Validity

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News