రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం

Telangana
Advertisement
  • భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్
  • ఆలయ రూపురేఖలు మార్చేలా తొలి విడత అభివృద్ధి పనులు
  • వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
Advertisement

ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ పరిసరాల్లో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ మెగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. భద్రాచలం రామాలయ రూపురేఖలను మార్చేలా మొత్తం రూ. 200.89 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ తొలి విడత అభివృద్ధి పనులను చేపట్టారు. ఆలయానికి తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న పాత నిర్మాణాల తొలగింపు పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి.


ఆలయ పరిసరాల క్లియరెన్స్ పూర్తయిన తర్వాత... ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ అభివృద్ధి పనులు చేపడతారు. వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి పండుగ నాటికి ఈ ఆలయ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

Bhadrachalam TempleBhadrachalam Temple DevelopmentTellam Venkata RaoBhadradri Temple Master PlanTelangana Temple NewsBhadrachalam Temple Budget

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News