Advertisement

వీడియో: తప్పిన పెను ప్రమాదం.. విమానం వైరల్‌ విన్యాసం!

International
Advertisement
  • అమెరికాలోని హార్స్‌షూ బే రిసార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
  • అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించిన విమానం
  • మలుపు తిరిగే సమయంలో కుడి రెక్క భూమికి దగ్గరగా వెళ్లిన వైనం
  • సురక్షితంగా ఫోర్ట్‌ వర్త్‌ అలయన్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌
  • ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు అప్పగించే ముందు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఘటన
అమెరికాలో భారీ బోయింగ్‌ 777-200ఎల్‌ఆర్‌ కార్గో విమానం తీసుకున్న ప్రమాదకర మలుపు విమానయాన రంగంలో తీవ్ర చర్చకు దారి తీసింది. టెక్సాస్‌లోని హార్స్‌షూ బే రిసార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించిన విమానం.. మలుపు తిరిగే సమయంలో కుడి రెక్క భూమికి కొన్ని అంగుళాల దూరం నుంచి వెళ్లినట్లు కనిపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జూన్‌ 24న జరిగిన ఈ ఘటనలో విమానం రన్‌వేపై అత్యంత తక్కువ ఎత్తులో ఫ్లైపాస్‌ చేసిన తర్వాత కుడివైపు మలుపు తిరిగింది. ఈ సమయంలో విమానం కుడి రెక్క నేలను తాకినంత పనైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా ఫోర్ట్‌ వర్త్‌ అలయన్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయింది.

ఈ విమానం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కార్గో రంగుల్లో ఉండటంతో తొలుత ఆ సంస్థ విమానమనే ప్రచారం జరిగింది. అయితే టెక్సాస్‌కు చెందిన లీజింగ్‌ సంస్థ జెట్రాన్‌ స్పందిస్తూ.. విమానం ఇంకా తమ అధీనంలోనే ఉందని తెలిపింది. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు అప్పగించే ముందు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. అలాగే ఈ విమానాన్ని నడిపిన పైలట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన వారు కాదని స్పష్టం చేసింది.

200 అడుగులకు పైగా రెక్కల విస్తీర్ణం ఉన్న ఇలాంటి భారీ విమానాలు తక్కువ ఎత్తులో మలుపులు తిరిగేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Boeing 777 200LRTexas plane viral videoQatar Airways CargoJetran aviation incidentLow altitude flight stuntHorseshoe Bay Resort Airport

More Telugu News

మహిళా కమిషన్ ఎదుట హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి

12 Nov, 22:07

జనసైనికులకు వైసీపీ లీగల్ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

12 Nov, 21:53

శత్రుచర్ల విజయరామరాజు మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

12 Nov, 21:36

రన్‌వేపైకి దూసుకొచ్చిన వీధి కుక్క.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో తప్పిన పెనుప్రమాదం

12 Nov, 21:26

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15

ఖైత‌లాపూర్ చెరువుకు హైడ్రా ఫెన్సింగ్.. సమాధి రాయికి జేసీబీ తగలడంతో ఉద్రిక్తత

12 Nov, 19:51

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా

12 Nov, 19:43

గూఢచర్యం నెపంతో టెక్నాలజీ దిగ్బంధం.. అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా

12 Nov, 19:30

నకిలీ కోర్టు తీర్పులతో వెబ్‌సైట్ల బ్లాకింగ్.. దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం

12 Nov, 19:18

హైదరాబాద్ వేదికగా మార్స్ జీసీసీ విస్తరణ.. జెన్‌పాక్ట్‌తో కీలక భాగస్వామ్యం

12 Nov, 19:06

విదేశీ టీ20 లీగ్‌లపై ఐసీసీ కొరడా.. కొత్త ఆంక్షలకు రంగం సిద్ధం!

12 Nov, 18:43
..More Telugu News