ఉద్యోగం పోయింది.. ఇప్పుడు రోజుకు రూ.50,000 టర్నోవర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం పోయింది.. ఇప్పుడు రోజుకు రూ.50,000 టర్నోవర్‌

Samitha Sulakkana software engineer turns layoff into successful business
  • లేఆఫ్‌తో ఉద్యోగం కోల్పోయిన శ్రీలంక టెక్కీ
  • ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా మినీ సూపర్‌మార్కెట్‌
  • గ్రామంలో అవసరాన్ని వ్యాపార అవకాశంగా మలచుకున్న యువకుడు
  • ఆన్‌లైన్‌ ఆర్డర్‌, క్యాష్‌ ఆన్‌ డెలివరీ సౌకర్యం
  • మూడు నెలల్లోనే రోజుకు రూ.50 వేలకుపైగా టర్నోవర్‌
ఉద్యోగం కోల్పోతే చాలామంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తారు. కానీ శ్రీలంకకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సమిత సులక్కణ మాత్రం భిన్నంగా ఆలోచించాడు. లేఆఫ్‌తో వచ్చిన అనిశ్చితిని అవకాశంగా మార్చుకుని సొంతంగా మినీ సూపర్‌మార్కెట్‌ ప్రారంభించాడు. ఇప్పుడు ఆ వ్యాపారం రోజుకు రూ.50 వేలకుపైగా టర్నోవర్‌ సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈ విషయాన్ని సమిత లింక్డిన్‌లో పంచుకున్నాడు. కొద్ది నెలల క్రితం తాను పనిచేస్తున్న సంస్థలో భారీ లేఆఫ్‌ జరిగిందని, దీంతో ఉద్యోగం కోల్పోయానని తెలిపాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే కొనసాగాలన్నదే తన కల అయినప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త దారిని ఎంచుకున్నానని చెప్పాడు.

తాను నివసించే గ్రామంలో మినీ సూపర్‌మార్కెట్‌ లేకపోవడాన్ని గమనించిన సమిత, దాన్నే వ్యాపార అవకాశంగా మలిచాడు. సాధారణ దుకాణంలా కాకుండా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కస్టమర్ల కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్‌ వ్యవస్థను రూపొందించాడు. ఇంటి నుంచే వస్తువులు ఆర్డర్‌ చేసే అవకాశం కల్పించడంతో పాటు క్యాష్‌ ఆన్‌ డెలివరీ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాడు.

వ్యాపారం ప్రారంభించిన కేవలం మూడు నెలల్లోనే రోజుకు రూ.50 వేలకుపైగా టర్నోవర్‌ సాధిస్తున్నట్లు సమిత వెల్లడించాడు. ఈ ప్రయాణంలో లాభాలతో పాటు ప్రజల అవసరాలను దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం కూడా లభించిందని పేర్కొన్నాడు.

సమిత కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘అవకాశం కోసం ఎదురుచూడకుండా అవకాశాన్ని సృష్టించుకున్నావు’’, ‘‘నీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం’’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
Samitha Sulakkana
Software engineer layoff success
Mini supermarket business
Sri Lanka entrepreneurship
Daily turnover fifty thousand
Software engineer turned entrepreneur

More Telugu News