2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్‌లో బాలకృష్ణ

Andhra
Advertisement
  • ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య
  • నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని వెల్లడి
  • లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయడమే లక్ష్యమన్న బాలయ్య
Advertisement
అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆసుపత్రి పనులను హిందూపూర్ ఎమ్మెల్యే, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ ఈరోజు క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు. సైట్ ఇంజనీర్లతో కలిసి ల్యాండ్ మ్యాప్స్, కన్‌స్ట్రక్షన్ డిజైన్లను రివ్యూ చేసిన బాలయ్య.. ఆసుపత్రి టైమ్‌లైన్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.


అమరావతిలో క్యాన్సర్ పేషెంట్లకు వరంగా మారబోతున్న ఈ మెగా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం చాలా వేగంగా సాగుతున్నాయని బాలకృష్ణ తెలిపారు. వచ్చే నెల పుట్టింగ్ పనులు మొదలవుతాయని చెప్పారు. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు వర్కర్లు పగలూ రాత్రి షిఫ్టుల్లో కష్టపడుతున్నారని తెలిపారు. అయితే, వర్షాకాలం కారణంగా పనులు కొంత నెమ్మదించే అవకాశం ఉందని చెప్పారు.


హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నామని... అదే క్రమంలో ఏపీ రాజధానిలోనూ అధునాతన వైద్యం అందించడమే తమ లక్ష్యమని బాలయ్య స్పష్టం చేశారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి 2028 నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తై, రోగులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, కేవలం క్యాన్సర్ బాధితులకు ప్రపంచ స్థాయి సేవ చేయాలనే ఏకైక పవిత్ర ధ్యేయంతోనే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

సంబంధిత వార్తలు

Nandamuri BalakrishnaBasavatarakam Cancer HospitalAmaravatiCancer Hospital ConstructionAndhra Pradesh Health InfrastructureBasavatarakam Indo American Cancer Hospital

More Telugu News

దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం!

01 Nov, 22:51

హైదరాబాద్‌లో లేడీ కిలాడి: ఆన్‌లైన్‌లో చూసి చోరీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

01 Nov, 22:11

మన వాయుసేనలో ఇవి ఉండాల్సిందే: ఐఏఎఫ్ నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

01 Nov, 21:59

పండుగ సీజన్‌లో కియా హవా.. అక్టోబర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అమ్మకాలు!

01 Nov, 21:50

తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

01 Nov, 21:42

ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

01 Nov, 21:36

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

01 Nov, 21:20

వ్యాయామం లేకుండా విటమిన్ మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు.. ఇది నిపుణుల మాట!

01 Nov, 21:10

ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

01 Nov, 21:02

వాణిజ్య సిలిండర్ ధర పెంపు నేటి నుంచే.. హోటళ్లపై భారం!

01 Nov, 20:54

రోజూ సాంబార్ తిని చచ్చిపోతావన్నారు: ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

01 Nov, 20:41

పులివెందులలో ఈ పరిస్థితికి జగనే కారణం: నారా లోకేశ్

01 Nov, 20:15

రేపు బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించనున్న జగన్

01 Nov, 20:07

'నగీనా'గా మారిన జాన్వీ.. తల్లి శ్రీదేవికి ఐకానిక్ నివాళి!

01 Nov, 19:53

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57
..More Telugu News