Advertisement

మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌

International
Advertisement
  • ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ
  • అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ
  • పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్‌ చేసిన మేక్రాన్‌
  • బ్యాగ్రౌండ్‌లో ధురంధర్‌ పాట
భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలకు బాలీవుడ్‌ టచ్‌ ఇచ్చారు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ఆయన షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ చిత్రం ‘ధురంధర్‌’లోని ప్రముఖ ‘ఆరీ ఆరీ’ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ మోదీ పర్యటనలోని ముఖ్య ఘట్టాలను ఆ వీడియోలో పొందుపరిచారు.

సుమారు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ‘ఎక్స్‌’, ఇన్‌స్టాగ్రామ్‌లో మేక్రాన్‌ పోస్టు చేశారు. మోదీ, మేక్రాన్‌ పరస్పరం కరచాలనం చేసుకోవడం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో మోదీ పాల్గొన్న కార్యక్రమాలు, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి.

భారతీయ పాప్‌ కల్చర్‌ను మేక్రాన్‌ తన సోషల్‌ మీడియా పోస్టుల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా భారత్‌ పర్యటన ముగిసిన తర్వాత 'ధురంధర్‌'కు సంబంధించిన సంగీతంతో కూడిన వీడియోను ఆయన షేర్‌ చేశారు. దీంతో భారతీయ నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Emmanuel MacronNarendra ModiIndia France RelationsDhurandhar MovieAari Aari SongPM Modi France Visit

More Telugu News

విశాఖలో సీఐఐ సదస్సు.. మంత్రి లోకేశ్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

12 Nov, 22:20

మహిళా కమిషన్ ఎదుట హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి

12 Nov, 22:07

జనసైనికులకు వైసీపీ లీగల్ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

12 Nov, 21:53

శత్రుచర్ల విజయరామరాజు మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

12 Nov, 21:36

రన్‌వేపైకి దూసుకొచ్చిన వీధి కుక్క.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో తప్పిన పెనుప్రమాదం

12 Nov, 21:26

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15

ఖైత‌లాపూర్ చెరువుకు హైడ్రా ఫెన్సింగ్.. సమాధి రాయికి జేసీబీ తగలడంతో ఉద్రిక్తత

12 Nov, 19:51

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా

12 Nov, 19:43

గూఢచర్యం నెపంతో టెక్నాలజీ దిగ్బంధం.. అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా

12 Nov, 19:30

నకిలీ కోర్టు తీర్పులతో వెబ్‌సైట్ల బ్లాకింగ్.. దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం

12 Nov, 19:18

హైదరాబాద్ వేదికగా మార్స్ జీసీసీ విస్తరణ.. జెన్‌పాక్ట్‌తో కీలక భాగస్వామ్యం

12 Nov, 19:06
..More Telugu News