Advertisement

అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు

International
Advertisement
  • అమెరికాలో తెలుగు విద్యార్థిని అనన్య గోలికి అరుదైన గౌరవం
  • కంప్యూటింగ్ రంగంలో ప్రతిభకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారం
  • పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కుటుంబం
  • టెక్నాలజీలో బాలికలను ప్రోత్సహించే మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది
అమెరికాలో మరో తెలుగు తేజం తన ప్రతిభతో మెరిసింది. పల్నాడు జిల్లాకు చెందిన అనన్య గోలి అనే విద్యార్థిని టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి అరుదైన గౌరవాన్ని అందుకుంది. మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఏటా అందించే 'మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్' (MnAiC) అవార్డుల్లో భాగంగా అనన్య 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారానికి ఎంపికైంది.

హైస్కూల్ విద్యార్థుల్లో కంప్యూటింగ్, టెక్నాలజీ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ వంటి అంశాల్లో చూపిన ప్రతిభకు ఈ అవార్డును అందిస్తారు. ముఖ్యంగా టెక్ రంగంలో బాలికలను, ఇతర వర్గాల వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఈ గౌరవానికి ఎంపికైన ఎనిమిది మంది విద్యార్థుల్లో అనన్య ఒకరిగా నిలవడం విశేషం.

అనన్య తల్లిదండ్రులు గోలి కృష్ణ చైతన్య, సంప సిన్హా. వీరి స్వస్థలం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి. సాఫ్ట్‌వేర్ నిపుణులైన వీరు 2014లో అమెరికాలో స్థిరపడ్డారు. అనన్య ప్రస్తుతం మిన్నెసోటాలోని ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NCWIT) అనుబంధ సంస్థ అయిన మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డులను నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే టెక్నాలజీలో తెలుగు బాలిక గుర్తింపు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Ananya GoliMinnesota Aspirations in ComputingMnAiC AwardTelugu girl USAIndian American studentTechnology awardEden Prairie High SchoolNCWITPalanadu districtSoftware professional

More Telugu News

విశాఖలో సీఐఐ సదస్సు.. మంత్రి లోకేశ్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

12 Nov, 22:20

మహిళా కమిషన్ ఎదుట హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి

12 Nov, 22:07

జనసైనికులకు వైసీపీ లీగల్ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

12 Nov, 21:53

శత్రుచర్ల విజయరామరాజు మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం

12 Nov, 21:36

రన్‌వేపైకి దూసుకొచ్చిన వీధి కుక్క.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ లో తప్పిన పెనుప్రమాదం

12 Nov, 21:26

బహిరంగంగా ప్రేమను ప్రదర్శించిందని మహిళకు కొరడా దెబ్బలు

12 Nov, 21:14

నిజంగా మహాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిన మరుసటి రోజే తండ్రికి రూ.1.5 కోట్ల లాటరీ!

12 Nov, 20:58

వాషింగ్టన్ లో కాల్పులు.. వైట్ హౌస్ సమీపంలో మరోసారి కలకలం

12 Nov, 20:44

సత్య నాదెళ్లను వెనక్కినెట్టి నెం.1గా సుందర్ పిచాయ్

12 Nov, 20:40

టెస్టు అరంగేట్రంలోనే 7 వికెట్లు.. శ్రీలంకపై సంచలనం సృష్టించిన పాక్ బౌలర్ సాకిబ్ ఖాన్

12 Nov, 20:15

ఖైత‌లాపూర్ చెరువుకు హైడ్రా ఫెన్సింగ్.. సమాధి రాయికి జేసీబీ తగలడంతో ఉద్రిక్తత

12 Nov, 19:51

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా

12 Nov, 19:43

గూఢచర్యం నెపంతో టెక్నాలజీ దిగ్బంధం.. అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా

12 Nov, 19:30

నకిలీ కోర్టు తీర్పులతో వెబ్‌సైట్ల బ్లాకింగ్.. దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం

12 Nov, 19:18

హైదరాబాద్ వేదికగా మార్స్ జీసీసీ విస్తరణ.. జెన్‌పాక్ట్‌తో కీలక భాగస్వామ్యం

12 Nov, 19:06
..More Telugu News