సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన
- డీకే తదితరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన
- కేబినెట్ ను రద్దు చేయబోతున్నానన్న సిద్ధరామయ్య
- తదుపరి ముఖ్యమంత్రిగా డీకే
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కీలక కాంగ్రెస్ నేతలతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం ముగిసింది. అనంతరం సిద్ధరామయ్య మీడియా ముఖంగా సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి తనకు లోపల ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య తెలిపారు. తనకు ఇంత కాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కేబినెట్ ను రద్దు చేయబోతున్నానని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టేందుకు డీకే శివకుమార్ తొలి నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయనకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే.