ఈ బీటెక్ రవిని కొనడం నీ వల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కాదు: అవినాశ్ రెడ్డి ఆరోపణలకు బీటెక్ రవి కౌంటర్

BTech Ravi counters Avinash Reddys Allegations
  • వైఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీటెక్ రవి
  • వివేకా కేసు వాపస్ కోసం బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశారంటూ ఆరోపణ
  • అమరావతికి వ్యతిరేకంగా రూ.15 కోట్లు ఇస్తానన్నారని సంచలన వ్యాఖ్యలు
  • ఎర్రచందనం స్మగ్లింగ్‌తో అవినాశ్‌కు సంబంధాలున్నాయన్న బీటెక్ రవి
 వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లి రూ.12 కోట్లకు ఎమ్మెల్సీ పదవి అమ్మజూపినట్టు అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, బీటెక్ రవి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడుంది బీటెక్ రవి.. బీటెక్ రవిని కొనడం నీవల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అవినాశ్ పై నిప్పులు చెరిగారు.

"వైఎస్ అవినాశ్ రెడ్డి నా గురించి మాట్లాడిన మాటలకు నేను సూటిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. డబ్బుతో నన్ను కొనగలమని నువ్వుగానీ, మీ సోదరుడు జగన్ మోహన్ రెడ్డి గానీ అనుకుంటే అది మీ భ్రమ. ఆ డబ్బు పిచ్చి పట్టింది మీ వైఎస్ కుటుంబానికే తప్ప, నాకు కాదు.

కొన్ని విషయాలు నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అమరావతికి మద్దతుగా తీర్మానం చేయకుండా ఉండేందుకు నాకు రూ.15 కోట్లు ఇస్తానని నువ్వు ఆఫర్ చేసిన మాట వాస్తవం కాదా? అని నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2014లో ఉల్లిమెట్ట తోటలో ఒక ఎంపీటీసీ విషయంపై మనం కలిసింది నిజం కాదా? ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తులేదా?

అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి అడుగుతాను. మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను హైకోర్టు నుంచి వెనక్కి తీసుకునేందుకు నాకూ, ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్కులు ఇస్తామని మమ్మల్ని సంప్రదించింది నువ్వు కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రెండు వైపులా ఉన్న అసంతృప్త నేతల వివరాలను మాకు అందించింది కూడా నువ్వే కదా?

రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, పాత పనులను రద్దు చేయించి రూ.15 కోట్ల కమీషన్ తీసుకున్నావని, ఆ డబ్బుతోనే ఇళ్లు కట్టుకున్నావని ఆరోపణలు ఉన్నాయి. వాటికి ఏం సమాధానం చెబుతావు? ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల గురించి మాట్లాడాలంటే సీఐ రాజేశ్వర్ రెడ్డి, గణకనపల్లి కృష్ణారెడ్డిని అడిగితే నీ బండారమంతా చెబుతారు.

నేను నీకు ఒకటే సవాల్ విసురుతున్నాను. ఉల్లిమెట్ట తోటలో నువ్వు చెప్పినట్టు ఏమీ జరగలేదని నిరూపిస్తే, నేను ఇప్పుడే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు.

ఇప్పటివరకు నువ్వు చూసింది కేవలం 'పుష్ప 1' మాత్రమే. త్వరలోనే 'పుష్ప 2', 'పుష్ప 3' కూడా నేను చూపిస్తాను. ఇది ఆరంభం మాత్రమేనని గుర్తుపెట్టుకో" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 
Go Back to Shorts
B.Tech Ravi
YS Avinash Reddy
Vivekananda Reddy murder case
Pulivendula
Andhra Pradesh Politics
TDP
YSRCP
MLC elections
corruption allegations

More Telugu News