హైదరాబాద్‌లో విద్యుత్ ప్రమాదాలు.. భట్టివిక్రమార్కకు వీహెచ్ కీలక సూచన

Bhatti Vikramarka VH Suggests Key Actions on Hyderabad Electrical Accidents
  • నగరంలో పలుచోట్ల విద్యుత్ వైర్లను మార్చాలన్న వీహెచ్
  • నిజాం కాలం నాటి వైర్లు ఉన్నాయన్న వీహెచ్
  • ఈ వైర్ల వల్ల ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందన్న వీహెచ్
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నగరంలో పలుచోట్ల విద్యుత్ వైర్లను మార్చాలని కోరారు. పలు ప్రాంతాల్లో నిజాం కాలంనాటి విద్యుత్ వైర్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. పాత వైర్ల కారణంగా కొన్నిచోట్ల విద్యుదాఘాతం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు ఈ ప్రమాదాల వల్ల చాలా నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వైర్లు వేయాలని వ్యాపారులు కోరుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రమాదాలు తగ్గి ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వైర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాడైన కరెంట్ వైర్ల కారణంగానే నగరంలో తరుచూ విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
Go Back to Shorts
Bhatti Vikramarka
Hyderabad
VH Hanumath Rao
Electrical accidents
Fire accidents
Telangana electricity

More Telugu News