ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి: నారా లోకేశ్
- బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- కర్నూలు, ఏఎస్ఆర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాం
- డీఈవోలు, ఏపీసీలతో సమీక్షా సమావేశంలో మంత్రి లోకేశ్
ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషిచేయాలి, ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షించారు. కాకినాడ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో స్టూడెంట్, టీచర్ యావరేజ్ అటెండెన్స్ తక్కువగా ఉంది. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పదో తరగతి పరీక్షా ఫలితాలు, మధ్యాహ్న భోజనం వినియోగంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. అపార్ ఐడీ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచారని మంత్రి ప్రశంసించారు.
కాకినాడ డీఈవో పి.రమేష్ స్పందిస్తూ, జిల్లాలో 3,665 మంది డ్రాపౌట్స్ ఉన్నారని, ఎన్ రోల్ కానివారు 14,840 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు అసలు ఎన్‌రోల్ కానివారిపై దృష్టిసారించామని చెప్పారు. పలు మండలాల్లో సూడెంట్స్ అటెండెన్స్ తక్కువగా ఉండటంపై తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది 80.47శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన వారు 2789 మంది ఉన్నారని తెలిపారు.
ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాలి
ప్రకాశం జిల్లాలో విద్యార్థుల డ్రాపౌట్స్ పై మంత్రి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వలస వెళ్లే వారిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పాఠశాలకు సెలవుల అనంతరం విద్యార్థులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారి చదువు కొనసాగేలా ట్రాక్ చేయాలని ఆదేశించారు. సీజనల్ హాస్టల్స్ ను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో స్టూడెంట్, టీచర్ అటెండెన్స్ తక్కువగా ఉందని, లీప్ యాప్ లో టీచర్ అటెండెన్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. స్టూడెంట్, టీచర్ రేషియోపైనా దృష్టిసారించాలన్నారు. ప్రకాశం జిల్లా డీఈవో సీవీ రేణుక స్పందిస్తూ.. ఈ ఏడాది జిల్లాలో పది శాతం ఎన్ రోల్ మెంట్ పెరిగిందని చెప్పారు. పాఠశాలలకు సెలవుల అనంతరం వ్యవసాయ పనుల్లో పడి విద్యార్థుల హాజరు నమోదు తక్కువగా ఉంటోందని వివరించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారని, పదో తరగతి టాపర్లను సన్మానించారని తెలిపారు. వచ్చే ఏడాది మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామని చెప్పారు.
బాల్యవివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
చిత్తూరు జిల్లాలో బాల్య వివాహాల పట్ల మంత్రి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో జీఎఫ్ఎల్ఎన్ పై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టూడెంట్స్ ఫెర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉందని, ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ లో కూడా చిత్తూరు వెనుకబడి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. చిత్తూరు డీఈవో కే.రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. చిత్తూరుకు తమిళనాడు, బెంగళూరు దగ్గరగా ఉండటంతో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పలుచోట్ల బాల్యవివాహాలు కూడా జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లీప్ యాప్ డౌన్ లోడ్స్ పై దృష్టికేంద్రీకరిస్తామని చెప్పారు.
ఏఎస్ఆర్ జిల్లాకు అన్ని విధాల అండగా ఉంటాం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ఆ జిల్లాకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి లోకేశ్ చెప్పారు. హైస్కూల్స్ లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థుల చేరిక తక్కువగా ఉందని, దీనిపైనా దృష్టిపెట్టాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై స్పందిస్తూ, అక్కడి విద్యార్థుల్లో కసి ఉందని, వారికి దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. డీఈవో కే.రామకృష్ణారావు స్పందిస్తూ.. జిల్లాలో 3,242 మంది డ్రాపౌట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ 79.30 శాతం ఉందని, టీచర్ల సరాసరి హాజరు 78.40 శాతంగా ఉందని వివరించారు.
స్లిప్ టెస్ట్ అటెండెన్స్ పై దృష్టిపెట్టాలి
ఏలూరు జిల్లాలో స్లిప్ టెస్ట్ అటెండెన్స్ తక్కువగా ఉందని, దీనిపై దృష్టిసారించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. టీచర్ అటెండెన్స్ పైనా దృష్టిసారించాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఎందుకు వెనుకబడి ఉన్నారని మంత్రి ఆరా తీశారు. కొన్ని మండలాల్లో ఉత్తీర్ణతా శాతంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ స్పందిస్తూ.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. టీ టైమ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పనితీరు గురించి తల్లిదండ్రులకు వివరిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల హాజరుపై దృష్టి కేంద్రీకరించాలి
పల్నాడు జిల్లాలో విద్యార్థుల హాజరుపై దృష్టికేంద్రీకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టీచర్ అటెండెన్స్, లీప్ యాప్ డౌన్ లోడ్స్ పైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పల్నాడు జిల్లాలో స్కూల్ అకడమిక్ స్టార్ రేటింగ్ లో హైస్కూల్స్ ఎక్కువగా 3స్టార్ రేటింగ్ లో ఉండటం పట్ల మంత్రి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా కృషిచేయాలన్నారు. పల్నాడు డీఈవో పీవీజే రామారావు స్పందిస్తూ.. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, విద్యార్థుల డ్రాపౌట్స్ పై దృష్టిసారించినట్లు చెప్పారు.
కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టిసారిస్తాం
కర్నూలు జిల్లా ఫలితాల పట్ల మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో భయానక పరిస్థితులు చూశానని, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం, డ్రాపౌట్స్ పై ఎక్కువ దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, పదో తరగతి పరీక్షా ఫలితాలు, టీచర్, స్టూడెంట్స్ అటెండెన్స్ లో జిల్లా వెనుకబడి ఉందని చెప్పారు.
మన్యం జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం బాగుంది
పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం బాగుందని, ఇందుకు గల కారణాలను మంత్రి లోకేష్ ఆరా తీశారు. జిల్లాలో జీఎఫ్ఎల్ఎన్ ఇంప్రూవ్ మెంట్ కు ఇంకా అవకాశం ఉందని, దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. ముస్తాబు కార్యక్రమాన్ని ప్రశంసించారు. డీఈవో పి.బ్రహ్మాజీ రావు స్పందిస్తూ.. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉందని చెప్పారు. త్వరలో 6వేల మంది విద్యార్థులతో కోలాటం కార్యక్రమం నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అకడమిక్ ఎక్స్ లెన్స్ పై దృష్టిపెట్టండి
పశ్చిమ గోదావరి జిల్లాలో అకడమిక్ ఎక్స్ లెన్స్ పై దృష్టికేంద్రీకరించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్-టీచర్ రేషియో బాగుందని ప్రశంసించారు. డీఈవో నారాయణ స్పందిస్తూ.. ప్రైమరీ స్కూల్స్ లో టీచర్ అటెండెన్స్ తక్కువగా ఉందని, దీనిపై దృష్టిసారిస్తామని చెప్పారు. డోర్ టూ డోర్ ప్రచారంలో లీప్ యాప్ డౌన్ లోడ్స్ పై దృషిపెడతామని తెలిపారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎస్జీటీ వాణి, అనంతపురం జిల్లా డీఈవో మోహన్ కృషిని మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.