భార్య కోసం.. అత్త చెప్పిందని కన్నతల్లికి విషం పెట్టిన కొడుకు
- ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
- ఆహారంలో విషం కలిపి తల్లికి తినిపించిన తనయుడు
- ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి
- నిందితుడి అరెస్ట్.. అత్తపై కేసు నమోదు
భార్య కాపురానికి తిరిగి రావాలనే ఒకే ఒక్క కారణంతో, కన్నతల్లిపైనే ఓ కొడుకు విషప్రయోగానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనలో, అత్త చెప్పిందని ఆహారంలో విషం కలిపి తల్లికి తినిపించాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, నిందితుడైన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగ్రా జిల్లా పినహట్ పరిధిలోని బార్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రవీంద్ర జులై 9వ తేదీన తన తల్లి రామ్మూర్తికి ఇష్టమైన చోలే కూరలో విషం కలిపి వడ్డించాడు. అది తిన్న కాసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
బాధితురాలి భర్త రణ్‌వీర్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన అత్త ఫూల్‌వతి ప్రోద్బలంతోనే రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. "నీ తల్లిని అడ్డు తొలగిస్తేనే నా కూతురు నీతో కాపురానికి వస్తుంది" అని ఫూల్‌వతి షరతు పెట్టినట్లు రవీంద్ర తనతో చెప్పాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతకాలంగా కుటుంబంలో భూవివాదం కూడా నడుస్తోందని, ఈ క్రమంలోనే రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని నిందితుడి సోదరుడు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు నిందితుడు రవీంద్ర, అతడి అత్త ఫూల్‌వతిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. రవీంద్రను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఫూల్‌వతి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి మెడికల్ రిపోర్టు, ఫోరెన్సిక్ ఆధారాల కోసం ఎదురుచూస్తున్నామని, వాటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.