గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య

Kopalle Karthik Murdered in Guntur District
  • తెనాలి సమీపంలోని కంచర్లపాలెంలో ఘటన
  • వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసుల అనుమానం
  • పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు
గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తెనాలి రూరల్ మండలం కంచర్లపాలెం గ్రామ శివారులోని వాలీబాల్ కోర్టు వద్ద ఈ ఘోరం వెలుగుచూసింది. మృతుడిని కోపల్లె కార్తీక్ (18)గా పోలీసులు గుర్తించారు.

వాలీబాల్ కోర్టు వద్ద కార్తీక్ నిర్జీవంగా పడి ఉండటాన్ని కొందరు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి రూరల్ పోలీసులు, క్లూస్ టీమ్ సాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి, గుర్తుతెలియని దుండగులు వాలీబాల్ నెట్ వైరును కార్తీక్ గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు పాత కక్షలు కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  
Go Back to Shorts
Guntur District
Kopalle Karthik
Tenali
Kancharlapalem
Murder
Crime news
Volleyball net
Andhra Pradesh police

More Telugu News