అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు

Avula Purna Gopi Software Engineer Dies in US Road Accident
  • అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతి
  • మృతుడి తండ్రికి తీవ్రగాయాలు, తల్లి, సోదరుడికి గాయాలు
  • కుటుంబం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం
  • న్యూ మెక్సికోలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆవుల పూర్ణగోపి
  • ఇటీవలే అమెరికాకు కుమారుడి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త తెలియడంతో బాపట్లలోని వారి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివసించే ఆవుల పూర్ణగోపి (35) అమెరికాలోని న్యూ మెక్సికోలో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భారత సైన్యంలో పనిచేసి రిటైరైన ఆయన తండ్రి ఆవుల శ్రీనివాసరావు, తన భార్య, చిన్న కుమారుడితో కలిసి ఇటీవలనే అమెరికా వెళ్లారు. నిన్న పూర్ణగోపి తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వారి వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్ణగోపి తల్లి, తమ్ముడికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Avula Purna Gopi
Andhra Pradesh
Road Accident
Software Engineer
New Mexico
Bapatla
Car Accident
US Accident

More Telugu News