లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత
- కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి
- భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్
- భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే
- గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, భారత బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్ పేస్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె కోల్‌కతాలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆమె అంత్యక్రియలు పూర్తిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జెన్నిఫర్ పేస్ కూడా ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప క్రీడాకారిణి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఆమె భారత బాస్కెట్‌బాల్ జట్టులో సభ్యురాలిగా పాల్గొన్నారు. ఆ తర్వాత 1982లో భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు ఆమె ముని మనుమరాలు కావడం విశేషం.
పేస్ కుటుంబం క్రీడా నేపథ్యం ఉన్నది. జెన్నిఫర్ భర్త, దివంగత డాక్టర్ వేస్ పేస్ భారత హాకీ జట్టు సభ్యుడిగా 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ గతేడాది ఆగస్టులో మరణించిన సంగతి తెలిసిందే. ఏడాది తిరిగేలోపే తల్లి కూడా మరణించడంతో లియాండర్ పేస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
తల్లిదండ్రుల స్ఫూర్తితో లియాండర్ పేస్ టెన్నిస్‌లో అసాధారణ విజయాలు సాధించారు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచి, తన తండ్రి ఒలింపిక్ వారసత్వాన్ని కొనసాగించారు. జెన్నిఫర్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు.