8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం!

8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం!

Couple Arrested in Rangareddy for Killing Two Women Who Loaned Them Money
  • రంగారెడ్డి జిల్లాలో దారుణం
  • అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్
  • ఇద్దరిని ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసిన నిందితులు
  • బతికిపోయిన మిగిలిన ఆరుగురు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తమకు అప్పు ఇచ్చిన వారిని చంపేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని మొయినాబాద్ లో జంట హత్యలు జరిగాయి. ఈ కేసు విచారణలో పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. కరీమా బేగం దంపతులు, మరో వ్యక్తి తమకు అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్ చేశారు.

అందులో ఇద్దరు మహిళలను చంపేశారు. మరో ఆరుగురిని కూడా హత్య చేసేందుకు ఫామ్‌హౌస్‌కు పిలిచారు. కానీ వారు రాకపోవడంతో ప్రాణాలు దక్కాయి. ఇద్దరు మహిళల హత్య ఘటన వెలుగు చూసిన తర్వాత తమకూ ప్రాణహానీ ఉందంటూ ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన అబేదాబేగం, మహబూబాబీ... అదే కాలనీలో ఉండే దంపతులు కరీమాబేగం, రెహమాన్, వీరి బంధువు నయీంకు వేర్వేరుగా కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించి ముందుగా మహబూబాబీని తొల్కట్ట ఫౌంహౌస్ వద్దకు తీసుకువెళ్ళి గొంతు నులిమి హత్య చేసి, అక్కడే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత అబేదా బేగంను కూడా అదేవిధంగా హత్య చేశారు.

మిగిలిన ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తవ్వకాలు చేపట్టారు.  మొదట మహబూబాబీ అస్తిపంజరం బయటపడింది. ఆ తర్వాత అబేదాబేగం మృతదేహం కూడా బయటపడింది. అనంతరం నిందితులను విచారించగా, అప్పు ఇచ్చిన ఆరుగురిని కూడా చంపేందుకు కూడా ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు.
Advertisement
Karima Begum
Moinabad murders
Rangareddy district crime
Telangana crime news
Debt murders

More Telugu News