రేపటి నుంచే 'పెద్ది' పోరాటం... ముంబైలో ట్రైలర్ టేకోవర్ కు అంతా రెడీ!

Ram Charans Peddi Trailer Launch in Mumbai Tomorrow
  • రేపు ముంబైలో 'పెద్ది' ట్రైలర్ విడుదల
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వం
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్
  • ట్రైలర్‌కు ముందు జగపతి బాబు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల
  • ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పాన్-ఇండియా చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ రేపటి నుంచి ఫుల్ స్పీడ్ లో కొనసాగనున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను మే 18న ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసేందుకు సర్వం సిద్దమైంది. "అతడి పోరాటం రేపటి నుంచి మొదలు" అనే క్యాప్షన్‌తో పెద్ది టీమ్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. 

"పెద్ది ట్రైలర్ టేకోవర్" పేరుతో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో మే 18న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను అభిమానులు, మీడియా సమక్షంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, విజయనగరం నేపథ్యంలో సాగే ఒక గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ట్రైలర్ విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, మే 17న నటుడు జగపతి బాబు పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రై రై రా రా' పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా, ఓవర్సీస్‌లో ప్రీ-సేల్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Ram Charan
Peddi
Buchi Babu Sana
Janhvi Kapoor
AR Rahman
Sukumar Writings
Mythri Movie Makers
Telugu movie
Indian cinema
sports action drama

More Telugu News