మరో రెండు గంటల్లో టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు
జేఎన్‌టీయూ-హెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్న ప్రముఖులు
పరీక్షలు ముగిసిన ఆరు రోజుల్లోనే ఫలితాల వెల్లడి
నిర్దేశిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఫలితాలు

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ (EAPCET) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ-హెచ్ ప్రాంగణంలో ఈ ఫలితాలను విడుదల చేసే కార్యక్రమం జరగనుంది.
ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్ వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్‌పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంకులను తెలుసుకోవచ్చు.