నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు

Manisha Mandhare Arrested in NEET Paper Leak Case
  • పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ
  • నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ
  • ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు
నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టయ్యారు. ఢిల్లీలో విచారణ అనంతరం పుణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ మందరేను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.

ఈ కేసుకు సంబంధించి నిన్న పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కులకర్ణిని కూడా నిన్న విచారణ అనంతరమే అరెస్టు చేశారు. మే 3వ తేదీన జరిగిన నీట్-యూజీ పరీక్ష లీకైనట్లు వార్తలు రావడంతో రద్దు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష లీక్ వ్యవహారాన్ని కేంద్రం సీబీఐకి అప్పగించింది.

కాగా, పి.వి.కులకర్ణి, మనీషా ఇద్దరూ నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే నిపుణుల ప్యానెల్ లో సభ్యులు అని తెలుస్తోంది. 
Go Back to Shorts
NEET Exam
NEET UG 2024
Manisha Mandhare
NEET Paper Leak
NEET Exam Cancelled
Botany Teacher

More Telugu News