"సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ

Chiranjeevi Reviews Ram Charan Peddi Trailer as Pure Fire
  • పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి ఫస్ట్ రివ్యూ
  • ఓ సూపర్ డైలాగ్ ను లీక్ చేసిన మెగాస్టార్
  • ట్రైలర్ చూసి కంట్రోల్ చేసుకోలేకపోయానని వెల్లడి
  • చరణ్, బుచ్చిబాబు, రెహమాన్‌ల పనితీరు అద్భుతమని ప్రశంసలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే, అధికారిక విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను వీక్షించి, తన స్పందనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన 'చిరులీక్స్' శైలిలో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

"పెద్ది ట్రైలర్ చూశాను!! జస్ట్... వావ్! 3 నిమిషాల ప్యూర్‌ ఫైర్‌పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. చరణ్‌, బుచ్చి, రెహమాన్‌.. ఒక్కొక్కరు తమ బెస్ట్‌ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్‌, ఎలివేషన్‌, మ్యాడ్‌నెస్‌ అన్నీ నెక్స్ట్‌ లెవల్‌లో ఉన్నాయి" అని చిరంజీవి ప్రశంసించారు.

అంతటితో ఆగకుండా, "చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి... 'మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు...' సారీ బుచ్చి బాబు… చూశాక కంట్రోల్ తప్పా!" అంటూ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను లీక్ చేశారు. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి ఇచ్చిన ఈ లీక్‌తో ట్రైలర్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Go Back to Shorts
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Chiranjeevi
Telugu Cinema
RRR Actor
AR Rahman Music
Rural Sports Action Drama
ChiruLeaks
Peddi Trailer

More Telugu News