బండి సంజయ్ కిందిస్థాయి నుంచి వచ్చారు, కుమారుడి కారణంగా తలవంపులు: సీఎం రేవంత్ రెడ్డి

  • బండి భగీరథ్ పారిపోవడం తప్పన్న ముఖ్యమంత్రి
  • బండి సంజయ్ బాధ్యత తీసుకుని కుమారుడిని అప్పగించాలని సూచన
  • ఈ కేసులో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందన్న రేవంత్ రెడ్డి
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కిందిస్థాయి నుంచి పైకి వచ్చారని, కుమారుడి కారణంగా ఆయనకు తలవంపులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుపై ముఖ్యమంత్రి స్పందించారు. బండి భగీరథ్ పారిపోవడం తప్పని స్పష్టం చేశారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.

అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదని ఆయన అన్నారు. తప్పయినా, ఒప్పయినా మొదట నిలబడి సమాధానం చెప్పగలగాలని అన్నారు. తక్షణమే కుమారుడిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు. ఈ కేసులో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay son
Revanth Reddy
Bandi Bhagirath
Telangana CM
POCSO case
Telangana news

More Telugu News