చంద్రబాబు సంచలన నిర్ణయం... కేవలం ఆన్ లైన్ లోనే మహానాడు!
- పొదుపు చర్యలు ప్రకటించిన ప్రధాని మోదీ
- నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు
- మోదీ పిలుపు నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం
- హైబ్రిడ్ విధానంలో రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు
- ఎన్టీఆర్ భవన్ లో స్టేజి ఏర్పాటు... రాష్ట్రవ్యాప్తంగా స్క్రీన్లపై ప్రసారం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈ ఏడాది కేవలం ఆన్ లైన్ లోనే జరపాలని నిర్ణయించారు.
వాస్తవానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో ఘనంగా మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, ప్రధాని మోదీ పశ్చిమాసియా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపుపై జాతికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పొదుపు చర్యలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మహానాడును ఆన్ లైన్ లో హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ప్రకటించడం ద్వారా ఆ పొదుపు చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఆన్ లైన్ లో మహానాడును ఈ నెల 27, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఒక వేదిక నిర్మించి దానిపై పొలిట్ బ్యూరో సభ్యులు ప్రసంగించనున్నారు. ఈ హైబ్రిడ్ మహానాడు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో ఎలక్ట్రానిక్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు.