మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కోహ్లీ.. ఇదిగో వీడియో!

Manish Pandey Stuns Virat Kohli with Amazing Catch in IPL 2026
  • గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్న వైనం
  • పాండే క్యాచ్ చూసి నివ్వెరపోయిన విరాట్ కోహ్లీ
  • ఐపీఎల్ 2026కే బెస్ట్ క్యాచ్ అంటూ కామెంటేటర్ల ప్రశంస
  • క్యాచ్ అనంతరం పాండేను ఆలింగనం చేసుకున్న కోహ్లీ
రాయ్‌పూర్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఫీల్డర్ మనీశ్ పాండే అసాధారణమైన క్యాచ్‌తో అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ క్యాచ్ చూసి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సైతం నివ్వెరపోయాడు.

ఆర్సీబీ 193 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా కార్తీక్ త్యాగి వేసిన బంతిని బ్యాటర్ టిమ్ డేవిడ్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్‌ను తాకిన బంతి అత్యంత వేగంగా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మనీశ్ పాండే, రెప్పపాటులో స్పందించాడు. తన ఎడమవైపునకు గాల్లోకి ఎగిరి, డైవ్ చేస్తూ ఒంటిచేత్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు.

ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి బౌలర్ కార్తీక్ త్యాగి నమ్మలేనట్టు తలపై చేతులు పెట్టుకున్నాడు. నాన్-స్ట్రైకర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ కూడా నివ్వెరపోయాడు. కామెంటేటర్లు ఈ క్యాచ్‌ను 'క్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026'గా అభివర్ణించారు. ఆ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా పాండే వద్దకు వెళ్లి అతడిని ఆలింగనం చేసుకుని అభినందించడం క్రీడాస్ఫూర్తిని చాటింది.
Go Back to Shorts
Manish Pandey
IPL 2026
RCB vs KKR
Virat Kohli
Stunning Catch
Royal Challengers Bangalore
Kolkata Knight Riders
Cricket
Tim David
Karthik Tyagi

More Telugu News