ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'.. దేశంలోనే తొలి ఫార్మసీ రైలు!

Aushadhi Express Indias First Pharmacy Train Launched from Hyderabad
  • ఔషధి ఎక్స్‌ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మసీ రైలు ప్రారంభం
  • హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు ఔషధాల సురక్షిత రవాణా
  • అత్యాధునిక కోల్డ్ స్టోరేజీతో మందుల నాణ్యతకు పూర్తి భరోసా
  • తెలంగాణ ఫార్మా రంగానికి ఇదొక లైఫ్ లైన్ అని తెలిపిన కిషన్ రెడ్డి
  • పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్న ప్రయోగం
భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. హైదరాబాద్ నుంచి ఔషధాలను సురక్షితంగా ఎగుమతి చేసేందుకు ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ పేరుతో దేశంలోనే మొట్టమొదటి ఫార్మసీ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల‌ 2వ తేదీన హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుకు తన తొలి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఔషధాలను వాటి నాణ్యత ఏమాత్రం దెబ్బతినకుండా నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం అత్యంత కీలకం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ రైలులో అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ కంటైనర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల హైదరాబాద్‌లోని వందలాది ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను సురక్షితంగా, వేగంగా ముంబై పోర్టుకు చేరవేసి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం సులభతరం అవుతుంది. గతంలో రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్ల మందులు పాడయ్యే ప్రమాదం ఉండేది. ఔషధి ఎక్స్‌ప్రెస్ ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనుంది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ఆవిష్కరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. "ఇది కేవలం ఒక రైలు మాత్రమే కాదు, తెలంగాణ ఫార్మా రంగానికి ఒక లైఫ్ లైన్ వంటిది. దీనివల్ల సరైన సమయంలో, సరైన నాణ్యతతో మందులు గమ్యస్థానాలకు చేరతాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఇలాంటి రైళ్లను విస్తరించే యోచనలో ఉన్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 
Go Back to Shorts
Aushadhi Express
pharmacy train
Kishan Reddy
Indian Railways
Hyderabad pharma
pharma exports
cold storage
Jawaharlal Nehru Port
PM Gati Shakti
pharma industry

More Telugu News