పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలని మోదీ పిలుపు... స్పందించిన కేంద్రమంత్రులు

Narendra Modi urges reduced petrol diesel gas usage
  • విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ఖర్చులు తగ్గించుకోవాలన్న అశ్వినీ వైష్ణవ్
  • ప్రయాణాల్లో ప్రజారవాణాను వినియోగించాలన్న నితిన్ గడ్కరీ
  • ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో మోదీ ఇచ్చిన పిలుపు ఉపకరిస్తుందన్న రాజ్‌నాథ్
అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని ఏడాది పాటు తగ్గించాలని, బంగారం కొనుగోళ్లకు ఏడాది పాటు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రులు స్పందించారు. విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రజలు, పరిశ్రమ వర్గాలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచించారు. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రధాని స్పష్టమైన సందేశం ఇచ్చారని ఆయన అన్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో తెలియదని అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ప్రతి ఖర్చును తగ్గించుకోవడం అవశ్యమని అన్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించుకోవడానికి మన ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. దానిని కాపాడుకోవడంతో పాటు మరింత సంపాదించాలని అన్నారు. ఈ రెండు పనులు సమాంతరంగా జరగాలని సూచించారు.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోదీ పిలుపునిచ్చారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రయాణాల్లో భాగంగా ప్రజారవాణాను వినియోగించాలని సూచించారు. ఒక్కొక్కరు ఒక్కో వాహనంలో ప్రయాణించడాన్ని నివారించాలని కోరారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో, ప్రపంచ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉపకరిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Petrol diesel consumption
Gas usage reduction
Central ministers response
Ashwini Vaishnaw

More Telugu News