బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం.. ఇదిగో వీడియో!
- పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి
- రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రక ఘట్టం. ఈ సందర్భంగా వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని, ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ దృశ్యం కార్యక్రమానికి హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకుంది.
కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు మరో ఐదుగురు మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని, 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది.
ఈ విజయం బీజేపీకి ఎంత ముఖ్యమో చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడమే నిదర్శనం. ఎన్నికలకు ముందు వీరిద్దరూ బెంగాల్లో విస్తృతంగా పర్యటించి, భారీ రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. వారి కృషి ఫలించి, బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
సువేందు అధికారి నేతృత్వంలోని తొలి మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతకు బీజేపీ పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దిలీప్ ఘోష్ (ఓబీసీ), అగ్నిమిత్ర పాల్ (కాయస్థ), అశోక్ కిర్తానియా (మథువ), క్షుదీరామ్ తుడు (గిరిజన తెగ), నిషిత్ ప్రామాణిక్ (రాజ్‌బొంగ్షి) వంటి వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. పార్టీ బలోపేతానికి, చారిత్రక విజయానికి కృషి చేసిన ఈ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా పార్టీ వారికి సరైన గుర్తింపునిచ్చింది.