దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్
- దుబాయ్‌లో భారత డ్రైవర్‌ను వరించిన అదృష్టం
- అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.64.6 కోట్లు గెలుపు
- మొత్తం 27 మంది పంచుకోనున్న ప్రైజ్ మనీ
- డ్రైవర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విజేత
దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ. 64.6 కోట్లు) గెలుచుకున్నాడు. అయితే ఈ భారీ మొత్తాన్ని ఆయన ఒక్కరే కాదు, మరో 26 మందితో కలిసి పంచుకోనుండటం విశేషం.
కేరళకు చెందిన 48 ఏళ్ల అబ్దుల్ రషీద్ అల్లిప్రా వలప్పిల్ అబ్దు, గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తూ ఓ ఎమిరాతీ కుటుంబం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గత ఆరేళ్లుగా ప్రతినెలా తన స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ లాటరీ కొనుగోలు చేస్తున్నాడు. మే 3వ తేదీన తీసిన సిరీస్ 265 డ్రాలో అబ్దుల్ రషీద్ బృందం ఏప్రిల్ 19న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 012318కు ఈ జాక్‌పాట్ తగిలింది.
లాటరీ గెలిచిన విషయంపై అబ్దుల్ రషీద్ సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ విజయం చాలా ఆనందంగా ఉంది. స్నేహితులతో ఉన్నప్పుడు ఈ విషయం తెలియడం మరింత ప్రత్యేకంగా అనిపించింది," అని ఆయన తెలిపారు. "మే 30న నా పుట్టినరోజు సందర్భంగా ఈసారి టికెట్‌ను నా పేరు మీద తీసుకున్నాను," అని ఆయన వివరించారు.
భారీ మొత్తం గెలుచుకున్నప్పటికీ, తాను డ్రైవర్‌గా కొనసాగుతానని అబ్దుల్ రషీద్ స్పష్టం చేశారు. ఈ ప్రైజ్ మనీని తమ బృందంలోని 27 మంది సభ్యులం పంచుకుంటామని, వీరంతా దుబాయ్‌లోని రషీదియాలో డ్రైవర్లు, టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. గెలుచుకున్న డబ్బును ఏం చేయాలనే విషయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.