విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్
- 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి
- టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు
- గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. ఆయన కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడి నుంచి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నుంచి వీఎస్ బాలు బరిలోకి దిగారు. 12 రౌండ్లు ముగిసేసరికి టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 41,051 వచ్చాయి. టీవీకే పార్టీ అభ్యర్థి 8 వేల పైచిలుకు మెజార్టీతో ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థికి కేవలం 12,259 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కొళత్తూరు నియోజకవర్గంలో మొదటి నుంచి డీఎంకేకు మంచి పట్టు ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొళత్తూర్ నుంచి పోటీ చేసిన స్టాలిన్... సమీప అన్నాడీఎంకే అభ్యర్థిపై 48,919 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 66.5 శాతం ఓట్లు స్టాలిన్‌కు వచ్చాయి. 2016లో స్టాలిన్ 68,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్టాలిన్‌కు, డీఎంకేకు గట్టి పట్టు ఉన్న కొళత్తూరులో ఇప్పుడు వీఎస్ బాలు స్టాలిన్ కంటే ముందున్నారు.