పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
- అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులు
- రీకౌంటింగ్ కోసం రూ.500, రీవెరిఫికేషన్ కోసం రూ.1,000 ఫీజు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీన ప్రారంభమై జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు ఒక సబ్జెక్టుకు రూ.1000 ఫీజు ఉంటుంది.