టాస్ గెలిచిన లక్నో.. మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్

Lucknow Super Giants will bowl first on Rajasthan Royals
  • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో
  • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ రిషభ్ పంత్
  • రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ ఓడిపోవాలని అనుకున్నానన్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
  • పిచ్ నెమ్మదిస్తుందనే ఉద్దేశంతో మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని వెల్లడి
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన‌ లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ వద్ద ఇరు జట్ల కెప్టెన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

టాస్ గెలిచిన అనంతరం రిషభ్ పంత్ మాట్లాడుతూ.. "గత కొన్ని మ్యాచ్‌లు మాకు సవాలుగా నిలిచాయి. అయితే సవాళ్లను మేము ఇష్టపడతాం. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ పరిస్థితులకు అలవాటు పడుతున్నాం" అని అన్నాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు పంత్ తెలిపాడు. అవేశ్ ఖాన్ స్థానంలో మయాంక్ యాదవ్, మరో బౌలర్ స్థానంలో రాఠీ జట్టులోకి వచ్చారని తెలిపాడు. స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతడికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశాడు.

మరోవైపు టాస్ ఓడిపోవడంపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరదాగా స్పందించాడు. "నిజానికి నేను టాస్ ఓడిపోవాలనే ప్రయత్నించాను. ఎందుకంటే ఏం ఎంచుకోవాలో నాకు చాలా గందరగోళంగా ఉంది. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాను" అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. పిచ్ పరిస్థితులపై తన వ్యూహాన్ని వివరిస్తూ, "ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిస్తోంది. అదే మళ్లీ జరగాలని మేము ఆశిస్తున్నాం" అని అన్నాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని పరాగ్ పేర్కొన్నాడు.

జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, దిగ్వేశ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.
Go Back to Shorts
LSG vs RR
Lucknow Super Giants
Rajasthan Royals
IPL 2026

More Telugu News