మ్యాచ్ సమయంలో 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు
- ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం
- పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే
- మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ సమయంలో "దోశ, ఇడ్లీ" అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. ఇది దక్షిణాది ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు, ఇక్కడి వారి సంస్కృతిని ఎగతాళి చేసేలా ఉందంటూ సీఎస్కే ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేసింది. ఇలాంటి మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదని తమ ఫిర్యాదులో పేర్కొంది.