సీఎస్‌కే అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్!

MS Dhoni Re entry Date Fixed Good News for CSK Fans
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అయితే, వరుస ఓటములతో నిరాశలో ఉన్న అభిమానులకు ఊరటనిచ్చే రెండు కీలక వార్తలు వెలువడ్డాయి. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.

కాలి పిక్క కండరాల గాయం నుంచి ధోనీ దాదాపు పూర్తిగా కోలుకున్నాడు. ఏప్రిల్ 14న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)తో జరిగే మ్యాచ్‌లో ఆయన తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఒకసారి ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొన్న ధోనీ, మరో రెండు రోజుల్లో ఇంకో పరీక్షకు హాజరుకానున్నాడని సమాచారం. ధోనీ లేకపోవడంతో జట్టులో నాయకత్వ లోపం, అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించాయి.

మరోవైపు, చెన్నై జట్టుకు మరో శుభవార్త అందింది. టోర్నీ ఆరంభానికి ముందు గాయపడిన దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ "ఆటకు దూరంగా ఉండటం కష్టంగా అనిపించింది. కానీ ఈ విరామం నాలో ఆకలిని మరింత పెంచింది. ప్రాక్టీస్‌లో బంతి బ్యాట్‌కు అద్భుతంగా కనెక్ట్ అవుతోంది. తిరిగి ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా" అని బ్రేవిస్ తెలిపాడు.

ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తుండటంతో చెన్నై తలరాత మారుతుందని, విజయాల బాట పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Go Back to Shorts
MS Dhoni
Chennai Super Kings
IPL 2026
CSK
Devold Brevis
Kolkata Knight Riders
Delhi Capitals
Cricket
Injury Update
MA Chidambaram Stadium

More Telugu News