అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు!
ఐపీఎల్ 2026లో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చాడు. అతనే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో, ఓటమి అంచున ఉన్న లక్నోను తన అద్భుత బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చాడు. అయితే, ముకుల్ సామర్థ్యం గురించి అతని సహచరుడు అర్జున్ టెండూల్కర్ ముందే హెచ్చరించినా కేకేఆర్ పెడచెవిన పెట్టి భారీ మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ, చివరి 4 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంది. అప్పుడే క్రీజులో ఉన్న ముకుల్ చౌదరి విశ్వరూపం ప్రదర్శించాడు. కామెరాన్ గ్రీన్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా వంటి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలువైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేసి, లక్నోకు 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
ఈ ప్రదర్శన చాలామందికి విస్మయం కలిగించినా, అర్జున్ టెండూల్కర్ మాత్రం ముందే ఊహించాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, "ముకుల్ చౌదరి అద్భుతమైన సిక్సర్లు కొడతాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్క్వేర్ లెగ్, పాయింట్, అప్పర్ కట్.. ఇలా అన్ని దిక్కులా అతను సిక్సర్లు కొట్టడం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను" అని చెప్పాడు. అర్జున్ ఈ మాటలు చెప్పినా, కేకేఆర్ బౌలింగ్ విభాగం ముకుల్‌ను తేలిగ్గా తీసుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.
మ్యాచ్ అనంతరం ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ, "నాకు మాటలు రావడం లేదు. ఒకరిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు చేస్తారని నమ్మాను. అది నిజమైంది" అని ముకుల్‌ను ఆకాశానికెత్తాడు. కోచ్ జస్టిన్ లాంగర్ కూడా, "అతనిలో పవర్, అథ్లెటిసిజం, గ్రేస్ ఉన్నాయి. వికెట్ల మధ్య పరుగు తీస్తుంటే కోహ్లీని చూసినట్టుంది. ఆటపై అతనికున్న అవగాహన 300 మ్యాచ్‌ల అనుభవంలా ఉంది" అని ప్రశంసించాడు. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల ముకుల్‌ను ఐపీఎల్ 2026 వేలంలో ఎల్‌ఎస్‌జీ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఒకే ఒక్క మ్యాచ్‌తో అతను తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.