రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్‌ వాసి అరెస్ట్

Renu Desai Harassment Case Vizag Man Arrested
షార్ట్స్‌లో చూడండి
నటి, ఫిల్మ్‌ మేకర్ రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు గాను ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన ఇదాదాసు అప్పారావు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అప్పారావు ఇటీవల రేణు దేశాయ్‌కు సంబంధించిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చూశాడు. ఆ తర్వాత, ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి, దాని ద్వారా ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని విశాఖలో గుర్తించారు. అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా, రేణు దేశాయ్‌పై ఆన్‌లైన్ వేధింపులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఇది రెండో అరెస్ట్ కావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితమే గుంటూరుకు చెందిన మరో వ్యక్తిని కూడా ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియా వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ‘‘సోషల్‌ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేయడం నేరం’’ అని హెచ్చరించారు.
 
Go Back to Shorts
Renu Desai
Renu Desai cyber crime
cyber crime arrest
social media abuse
online harassment
Visakhapatnam
Gachibowli
Idadasu Apparao
cyber crime police
Instagram reel

More Telugu News